Home » Telangana DGP
తెలంగాణ అసెంబ్లీ దగ్గర జరిగిన ఘటనపై దాఖలైన పిటీషన్‌పై రాష్ట్ర హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో డీజీపీ సీవీ ఆనంద్‌కు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు గురించి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.
నేరాల దర్యాప్తు, పోలీసింగ్‌లో వృత్తి నైపుణ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు.
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. సైబర్ నేరాల బారినపడుతున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారని పేర్కొన్నారు.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు ఈ-మెయిల్ పంపారు.
పోలీసు శాఖలో మెరుగైన సంస్కరణలు తీసుకువస్తున్నామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. తెలంగాణలో మావోయిజం, నక్సలిజం పూర్తిగా అంతమైందని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో డయల్ 112 సేవలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బుధవారం ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో వాష్‌రూమ్‌లో స్వామి ఆత్మహత్య చేసుకున్నారు.
పోలీస్ వ్యవస్థలో అవినీతిని నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. ప్రలోభాలకు లొంగవద్దని సిబ్బందిని కోరుతున్నామని అన్నారు.
పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దేశంలోనే ఉత్తమ పోలీసు ధ్రువీకరణ సేవలకు గాను ‘ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు’ వరించింది.