Telangana High Court: తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట
ABN , Publish Date - Jan 09 , 2026 | 03:05 PM
డీజీపీ నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేయాలన్న పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం యూపీఎస్‌సీ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy)కి హైకోర్టులో (Telangana High Court) ఊరట లభించింది. డీజీపీ నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేయాలన్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా శివధర్‌రెడ్డిని డీజీపీగా నియమించారంటూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త టి.మదన్‌గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం డీజీపీ నియామక ఉత్తర్వులపై స్టే విధించడానికి నిరాకరించింది.
రెగ్యులర్ ప్రాసెస్‌ను 4 వారాల్లో పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. యూపీఎస్‌సీకి పంపిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
అలాస్కా ట్రిప్.. మైనస్ 40 డిగ్రీల చలి.. తెలుగు విద్యార్థి అదృశ్యం
కేటీఆర్‌పై గజ్జెల కాంతం షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News