Home » Telangana High Court
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది.
సిగాచీ పేలుళ్ల ఘటనపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు బాధ్యులెవరినీ గుర్తించలేదా అంటూ సీజే సీరియస్ అయ్యారు.
గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2019 సెలెక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది.
తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తున్న క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు ఓపెన్ అయినట్లు సమాచారం.
హైదరాబాద్‌లో అధ్యాపక సభని శనివారం నిర్వహించాలని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో FATHI లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటీషన్‌పై జస్టీస్ శ్రవణ్ కుమార్ విచారణ జరిపారు.
మహేశ్వరం భూదాన్ భూముల వ్యవహారం పై తెలంగాణ హైకోర్టు తీర్పు కీలక తీర్పు ఇచ్చింది. ల్యాండ్ ను కొనుగోలు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సర్వే నెంబర్ 194, 195 భూదాన్ భూమిని అక్రమంగా మ్యుటేషన్ చేసి అన్యాక్రాంతం చేశారంటూ పిటిషనర్ తరఫున లాయర్ హైకోర్టు వాదించారు.
ఈ సమయంలో ఎలాంటి డైరెక్షన్ అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది హైకోర్టు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సరికాదని పిల్ దాఖలవగా... ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో పత్రికల్లో కథనాల ఆధారంగా పిల్ ఎలా వేస్తారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ హై కోర్టులో ఊరట లభించింది. నల్గొండలో వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన మూడు కేసులను హైకోర్టు కొట్టివేసింది.
తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. గతంలో ఆయన త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.