నాలుగు వారాల్లో రెగ్యులర్ డీజీపీ నియామకం పూర్తి చేయాలి.. సుప్రీంకోర్టు ఆదేశం
ABN , Publish Date - Feb 05 , 2026 | 12:49 PM
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ యూపీఎస్సీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డీజీపీ నియామకాన్ని సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వాదనలు వినిపించి విచారణను ముగించింది.
ఇటీవల తెలంగాణ హైకోర్టు డీజీపీ నియామకాన్ని సవాల్ చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని యూపీఎస్సీతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఈ ప్రక్రియను యూపీఎస్సీ, తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో నిర్వహించాలని స్పష్టంగా ఆదేశించింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పును సుప్రీం న్యాయస్థానం సవరించింది. గత ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని యూపీఎస్సీ సహా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో పోలీస్ పరిపాలనపై ప్రభావం
సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణలో రెగ్యులర్ డీజీపీ నియామకంపై నెలకొన్న అనిశ్చితి తొలిగే అవకాశం కనిపిస్తోంది. నాలుగు వారాల్లో నియామకం పూర్తి కావాల్సి ఉండటంతో రాష్ట్ర పోలీస్ పరిపాలనలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?
Read Latest Telangana News And AP News And Telugu News