Share News

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

ABN , Publish Date - Feb 02 , 2026 | 01:06 PM

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలుపై రాష్ట్ర హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయగా.. ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది న్యాయస్థానం.

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
Supreme Court

ఢిల్లీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టులో(Supreme Court) తెలంగాణ ప్రభుత్వానికి(Telangana Government) చుక్కెదురైంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలుపై రాష్ట్ర హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీం న్యాయస్థానం డిస్మిస్ చేసింది.


సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలు పోస్టులు పెట్టారని పోలీసులు మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ కేసుపై గతంలో విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు.. సదరు ఎఫ్ఐఆర్‌లను కొట్టివేస్తూ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులపై మెకానికల్‌గా కేసులు నమోదు చేయొద్దని పోలీసులకు సూచించింది. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా గతంలో ప్రస్తావించారు. ఈ కేసును తాజాగా విచారించిన సుప్రీం న్యాయస్థానం.. హైకోర్టు తీర్పును అభినందిస్తున్నామని, మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేమీలేదని స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

కేటీఆర్ వ్యాఖ్యలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనం: కవిత

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 02 , 2026 | 02:08 PM