Share News

కేటీఆర్ వ్యాఖ్యలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనం: కవిత

ABN , Publish Date - Feb 02 , 2026 | 12:01 PM

మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్‌గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో చెడ్డ వాళ్లకి ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా అని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని విమర్శించారు.

కేటీఆర్ వ్యాఖ్యలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనం: కవిత
Kavitha

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్ (KTR) టార్గెట్‌గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) విమర్శలు చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో సోమవారం మీడియాతో కవిత మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎవరు నిలబడ్డ కారు గుర్తుపై ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారని ప్రస్తావించారు.


చెడ్డ వాళ్లకి ఓటు వేయాలా..

చెడ్డ వాళ్లకి ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా అని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కులం కాదని.. గుణం చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. పైసలు కాదని.. పని చేసేవారికి ఓటు వేయాలని సూచించారు. మంచి అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసిన ఓటు వేయాలని కోరారు. తెలంగాణ జాగృతి తరఫున మంచి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తున్నారని కవిత పేర్కొన్నారు.


రేవంత్‌రెడ్డితో హరీశ్‌రావు కుమ్మక్కు..

రేవంత్‌రెడ్డితో హరీశ్‌రావు కుమ్మక్కు అయి.. నాటకాలాడుతున్నారని కవిత విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఫెయిర్‌గా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై కేసీఆర్‌ని సిట్ విచారణకు పిలిచిందని ప్రస్తావించారు. ఈ కేసులో సిట్ విచారణకు పిలిస్తే ఎవరైనా పోక తప్పదని కవిత స్పష్టం చేశారు.


బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం..

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మోదీ సర్కార్ అన్యాయం చేసిందని కవిత విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. గంజాయి ముఠా దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ ఫీజు సొంతంగా కట్టుకున్నారా..? ప్రభుత్వ సొమ్ముతో కట్టారా అని ప్రశ్నించారు.


రేవంత్‌రెడ్డి ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ వెళ్లి ఎన్ని ఏంఓయూలు చేసుకున్నారని నిలదీశారు. ఫేక్ కంపెనీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఓయూలు చేసుకుందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూలపై యువత దృష్టి పెట్టాలని సూచించారు. ఫేక్ ఏంఓయూలపై జాగృతి పోరాటం చేస్తుందని కవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ సమగ్ర దర్యాప్తు.. కేసీఆర్‌ని అడిగిన ప్రశ్నలివే..!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కెమెరా జర్నలిస్ట్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 02 , 2026 | 12:17 PM