Home » Telangana News
నైరుతి రుతుపవనాలు నిరాశపరచడం, వానాకాలం సీజన్ పూర్తికావడం, ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో రానున్న రోజులు ఎలా ఉంటాయోననే బెంగ పట్టుకుంది.
‘పాలమూరు- రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం నుంచి నల్లగొండకు తరలించే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (డీఎల్‌ఐ)ను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ కోదండరామ్, ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలకు నిత్యావసరాల సరఫరాను మెరుగుపర్చాలని, విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం, సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన కేంద్రీకృత (సెంట్రలైజ్డ్) కాంట్రాక్ట్ విధానం.. అసలుకే ఎసరు తెచ్చింది.
తెలంగాణ రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య(ఆయిల్‌ఫెడ్) పరిధిలోని వివిధ జిల్లాల్లో ఉన్న పామాయిల్ గెలల సేకరణ కేంద్రాల( ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్) నిర్వహణకు సంబంధించి అక్రమాలు వెలుగు చూడటంతో సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ)ను పరిచయం చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
ఆన్‌లైన్ రమ్మీ పేరుతో గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల నిర్వాహకులు ఆటగాళ్లను స్వయంచాలక ‘బాట్స్’తో మోసం చేసిన విషయాన్ని ఈడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు.
రాష్ట్రంలో కొత్తగా 41 ‘2బీ’ బార్ల ఏర్పాటుకు రంగం సిద్థమైంది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బార్ అండ్ రెస్టారెంట్‌ను ‘2బీ బార్’గా వ్యవహరిస్తారు.
రైస్ మిల్లర్లు కొద్దిరోజులుగా పాటిస్తున్న సమ్మెను విరమించారు. తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ కొంతకాలంగా తాము పాటిస్తున్న సమ్మెను విరమిస్తున్నామని రాష్ట్ర రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శనివారం ప్రకటించింది.
అరుణోదయ సమాఖ్య అధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ఉద్యమ ప్రస్థానం నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో 50 గంటల ప్రజా కళాజాతర కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది.
త్వరలో జరగబోయే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.