Share News

Kavitha: సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల నిబంధనను ఉల్లంఘిస్తున్నారు.. కవిత ఫైర్

ABN , Publish Date - Nov 30 , 2025 | 02:31 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనలు చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. ఎన్నికలు గ్రామాల్లో ఉంటే .. జిల్లా కేంద్రాలకు వెళ్లి ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారా అని ఎద్దేవా చేశారు.

Kavitha: సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల నిబంధనను ఉల్లంఘిస్తున్నారు.. కవిత ఫైర్
Kavitha

హైదరాబాద్, నవంబరు30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) జిల్లాల పర్యటనలు చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా కవిత ట్వీట్ పెట్టారు. పట్టణ ప్రాంతాల్లో సీఎం పర్యటనలకు.. ప్రభుత్వ సొమ్ముతో ప్రచారం చేస్తున్నారా.. ?? అని ప్రశ్నించారు.


ఎన్నికలు గ్రామాల్లో ఉంటే .. జిల్లా కేంద్రాలకు వెళ్లి ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారా అని ఎద్దేవా చేశారు. అక్కడికి జిల్లా ప్రజలు అందరినీ ప్రభుత్వ సొమ్ముతో తరలించి ఏం సందేశం ఇస్తారని దెప్పిపొడిచారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల నిబంధనను ఉల్లంఘించటమేనని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకుని, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనను వెంటనే నిలిపివేయాలని కవిత డిమాండ్ చేశారు.



ఈ వార్తలు కూడా చదవండి..

ఔటర్ చుట్టూరా.. మెట్రో నిర్మిస్తే ఎంతో ప్రయోజనం

భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఈ ప్రయోజనాలు..?

Read Latest TG News and National News

Updated Date - Nov 30 , 2025 | 09:54 PM