After Meals: భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఈ ప్రయోజనాలు..?
ABN , Publish Date - Nov 30 , 2025 | 07:36 AM
భోజనం చేసిన వెంటనే చాలా మంది కుర్చీలో కూర్చొంటారు. మంచంపై నడుం వాల్చేస్తారు. అలా చేయడం కంటే.. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు.
భోజనం చేసిన తర్వాత చాలా మంది హాయిగా కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు. లేదా మంచంపై అలా నడుం వాల్చేస్తారు. అయితే భోజనం చేసిన తర్వాత అలా విశ్రాంతి తీసుకోవడం అంత మంచిది కాదని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. భోజనం అనంతరం 10 నుంచి 15 నిమిషాలు నడవాలని వారు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల.. మీకు తెలియకుండానే మీ శరీరానికి ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు. నడక మంచి వ్యాయామం, రాత్రి భోజనం అనంతరం ఇలా చేయడం మంచిదని పేర్కొంటున్నారు. భోజనం చేసిన తర్వాత దాదాపు 15 నిమిషాల నడక వల్ల గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని వివరిస్తున్నారు. ఇలా చేయడం.. శరీరానికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
రక్తంలో చక్కెర స్థాయిలు..
భోజనం అనంతరం నడక వల్ల.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు. శక్తి కోసం కండరాలు.. అధిక గ్లూకోజ్ తీసుకుంటాయి. ఇది రక్తంలో ప్రసరించి.. చక్కెర పరిమాణాన్ని నియంత్రించడానికి సహాయ పడుతుంది. గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరచడంలో ఈ నడక ప్రభావవంతంగా పని చేస్తోందని పరిశోధనల్లో కూడా తేలింది.
జీర్ణక్రియను..
నడవడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనం తర్వాత మితమైన వేగంతో నడవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుందని పలు అధ్యయనాల్లో సైతం వెల్లడైంది. భోజనం తర్వాత నడక వల్ల జీర్ణవ్యవస్థను ఉత్తేజపరచడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి..
గుండెకు మేలు చేస్తోంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె నాళాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెను బలోపేతం చేస్తోంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
బరువు..
భోజనం తర్వాత నడక వల్ల అదనపు కేలరీలు తగ్గుతాయి. ఇది శరీరంలో కొవ్వు నిల్వలతోపాటు బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
మెరుగైన నిద్ర.. మానసిక ఆరోగ్యం..
భోజనం తర్వాత నడక వల్ల మంచి నిద్ర.. మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. భోజనం తర్వాత శారీరక శ్రమ వల్ల పలు హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. మెలటోనిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. మంచి నిద్రను మెరుగుపరుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
CAT పరీక్ష.. అభ్యర్థులకు కీలక సూచన
‘పది’పై పరేషాన్.. ఆ టీచర్లకు పరీక్షే..
Read Latest Health News and National News