Telangana: యువకుడి ప్రాణం తీసిన ఓటు పంచాయితీ..
ABN , Publish Date - Dec 24 , 2025 | 03:04 PM
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓటు వ్యవహారం ఓ నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి..
హైదరాబాద్, డిసెంబర్ 24: రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓటు వ్యవహారం ఓ నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి.. తనకు ఓటు ఎందుకు వేయలేదని మందలించడంతో మనస్తాపానికి గురైన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శంకరపల్లి మండలంలోని గోపులారం గ్రామానికి ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సాయికుమార్ అనే వ్యక్తి బీజేపీ తరఫున పోటీ చేశాడు. ఈ ఎన్నికల్లో సాయికుమార్ ఓడిపోయాడు. అయితే, తనకు ఓటు వేయలేదంటూ అనిల్ కుమార్ అనే వ్యక్తిని సాయి కుమార్ మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన అనిల్.. తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనిల్ ఉరి వేసుకోవడం గమనించిన తల్లి.. చుట్టుపక్కల వారిని పిలిచి అతన్ని కాపాడే ప్రయత్నం చేసింది. వారి సహాయంతో అనిల్‌ను శంకరపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనిల్ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేశారు. అనిల్ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read:
రికార్డులే రికార్డులు.. వైభవ్ సూర్యవంశీని వెనక్కి నెట్టిన ఇషాన్ కిషన్
2 రోజుల్లోనే అలర్జీ వచ్చింది.. ఢిల్లీ వాయి కాలుష్యంపై నితిన్ గడ్కరి కీలక వ్యాఖ్యలు
కుర్రాళ్లు కుమ్మేశారంతే.. 574 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసిన బిహార్!