Vijay Hazare Trophy: రికార్డులే రికార్డులు.. వైభవ్ సూర్యవంశీని వెనక్కి నెట్టిన ఇషాన్ కిషన్
ABN , Publish Date - Dec 24 , 2025 | 02:53 PM
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌కు నాయకత్వం వహిస్తున్న ఇషాన్ కిషన్.. 33 బంతుల్లో సెంచరీ చేశాడు. కాసేపటి క్రితమే బిహార్ తరఫున వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో శతకం బాదాడు. తాజాగా ఇషాన్ కిషన్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల రికార్డులు నమోదవుతున్నాయి. కాసేపటికి ముందే బిహార్ తరఫున వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత రెండో ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. అయితే తాజాగా స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ఆ రికార్డు(Vijay Hazare Trophy)ను బద్దలు కొట్టాడు. జార్ఖండ్‌కు నాయకత్వం వహిస్తున్న ఇషాన్.. కర్ణాటకతో మ్యాచులో కేవలం 33 బంతుల్లోనే శతకం బాదేశాడు. వైభవ్ సూర్యవంశీ రికార్డును బద్దలు కొట్టి ఇషాన్ ముందుకు దూసుకెళ్లాడు. ఈ జాబితాలో అన్మోల్ ప్రీత్ సింగ్ అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఇషాన్ కిషన్.. మూడో స్థానంలో వైభవ్ సూర్యవంశీ కొనసాగుస్తున్నారు.
ఇషాన్ కిషన్ జార్ఖండ్ తరఫున ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 39 బంతుల్లో ఏడు ఫోర్లు, 14 సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. ఇటీవలే జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అద్భుతమైన ఫామ్‌లో ఉండి అజేయ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఆ ప్రదర్శన తర్వాత ఇషాన్ కిషన్‌కు టీ20 ప్రపంచ కప్ 2026లో చోటు దక్కిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్.. తొలిసారి స్పందించిన స్టోక్స్
బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ