Vijay Hazare Trophy: ముంబై టార్గెట్ 237.. హిట్‌మ్యాన్ నిలబడతాడా?
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:02 PM
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబైతో జరుగుతున్న మ్యాచులో సిక్కిం 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ముంబైకి 237 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వరుస హాఫ్ సెంచరీలతో మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ.. ముంబై తరఫున ఎలా ఆడతాడో చూడాలి.
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపుర్ వేదికగా ముంబై-సిక్కిం జట్లు తలపడుతున్నాయి. సిక్కిం జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని.. ఓ మోస్తరు స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. దీంతో ముంబై 237 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగనుంది. టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. ముంబై తరఫున ఆడుతుండటంతో అభిమానులంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
సిక్కిం బ్యాటర్లలో ఆశిష్ తపా(79) రాణించాడు. సాయి సాత్విక్(34), క్రాంతి కుమార్(34) పర్వాలేదనిపించారు. అమిత్(0), గురిందర్ సింగ్(17), అంకుర్(9) తీవ్రంగా విఫలమయ్యారు. లీ యాంగ్(1), రాబిన్ లింబో(31) నాటౌట్‌గా నిలిచారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ 2, తుషార్ దేశ్‌పాండే, తనుశ్, ములాని, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
రోహిత్ నిలబడతాడా?
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రాక్టీస్ మ్యాచ్ కింద ఈ దేశవాళీ ఆడుతున్నాడు. ఆసీస్, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ల్లో మంచి ఫామ్ కొనసాగిస్తూ అర్థ శతకాలు బాదిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ ఇప్పటి వరకు 18 మ్యాచులు ఆడి 600 పరుగులు చేశాడు. మరి ఇప్పుడు హిట్‌మ్యాన్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగులు చేస్తాడా? లేదా? చూడాల్సి ఉంది.
ఇవీ చదవండి:
మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్.. తొలిసారి స్పందించిన స్టోక్స్
బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ