Share News

Vijay Hazare Trophy: బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ

ABN , Publish Date - Dec 24 , 2025 | 10:59 AM

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బిహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. 36 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకుని పెవిలియన్ చేరాడు.

Vijay Hazare Trophy: బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచులో బిహార్ తరఫున సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే శతకం బాది రికార్డు సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన రెండో భారత ఆటగాడిగా వైభవ్(Vaibhav Suryavanshi) రికార్డులకెక్కాడు.


డబుల్ సెంచరీ మిస్..

ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ(190) తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. తేచి నేరి బౌలింగ్‌లో డోరియాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 27 ఓవర్లు ముగిసే వరకు బిహార్ స్కోరు 261/2. పీయూష్ సింగ్(29), మంగళ్ మహరూర్(33) పర్వాలేదనిపించారు.


ఆ జాబితా ఇదే..

అత్యంత వేగంగా సెంచరీలు బాదిన భారత ఆటగాళ్లు ఎవరంటే..

  • అన్మోల్ ప్రీత్ సింగ్- 35 బంతుల్లో (2024)

  • వైభవ్ సూర్యవంశీ- 36 బంతుల్లో(2025)

  • యూసఫ్ పఠాన్- 40 బంతుల్లో (2010)

  • ఉర్విల్ పటేల్- 41 బంతుల్లో (2023)

  • అభిషేక్ శర్మ- 42 బంతుల్లో (2021)


ఇవీ చదవండి:

టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌లో దీప్తి శర్మ!

టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు

Updated Date - Dec 24 , 2025 | 11:33 AM