Ro-Ko: విజయ్ హజారే ట్రోఫీ.. రో-కో పారితోషికం ఎంతో తెలుసా?
ABN , Publish Date - Dec 24 , 2025 | 09:00 AM
నేటి నుంచి దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ-ఆంధ్ర తలపడుతున్నాయి. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్లు ఆడుతుండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రో-కో ఈ మ్యాచులకు ఎంత పారితోషికం తీసుకుంటారనే దానిపై చర్చ నడుస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: నేటి(బుధవారం) నుంచి జనవరి వరకు ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. బీసీసీఐ ఎక్స్‌లెన్స్ మైదానం వేదికగా తొలి మ్యాచ్‌లో ఢిల్లీ-ఆంధ్ర జట్లు తలపడనున్నాయి. టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచులో ఆడుతుంటడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(Virat Kohli ) దాదాపు 15 ఏళ్ల తర్వాత దేశవాళీ(Vijay Hazare Trophy) ఆడుతున్నారు. అయితే వీరి పారితోషికంపై ప్రస్తుతం అంతటా చర్చ నడుస్తుంది. మరి రో-కో ఆడనున్న ఈ మ్యాచులకు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసా?
బీసీసీఐ నిబంధనల ప్రకారం.. దేశవాళీ క్రికెట్‌లో పారితోషికం వారి అనుభవంపై ఆధారపడి ఉంటుంది. విరాట్ ఢిల్లీ తరఫున, రోహిత్(Rohit Sharma) ముంబై తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీసీఐ దేశవాళీ లిస్సటస్-ఏ మ్యాచుల కోసం మూడు రకాల పేమెంట్ స్లాబ్‌లను నిర్ణయించింది. 41 కంటే ఎక్కువ మ్యాచులు ఆడిన అనుభవం ఉంటే ఒక్కో మ్యాచ్ చొప్పున రూ.60వేలు ఇస్తారు. 21 నుంచి 4 మ్యాచుల అనుభవానికి రూ.50వేలు, 20 కంటే తక్కువ మ్యాచులు ఆడి ఉంటే రూ.40వేలు ఇస్తారు.
రో-కో సంపాదన ఇదే..
రో-కోకు వందల మ్యాచుల ఆడిన అనుభవం ఉంది. కాబట్టి వారు అత్యధిక స్లాబ్ అయిన రూ.60వేలు తీసుకుంటారు. విరాట్ కోహ్లీ ఢిల్లీ తరపున కోహ్లీ 3 లీగ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. తద్వారా అతను ఈ టోర్నీ ద్వారా సుమారు రూ. 1.80 లక్షలు అర్జిస్తాడు .రోహిత్ శర్మ ముంబై తరపున రోహిత్ 2 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. దీని ద్వారా అతనికి రూ. 1.20 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది.
ఆ ఫీజుతో పోలిస్తే..
విరాట్, రోహిత్ వంటి ఆటగాళ్లకు ఈ మొత్తం చాలా తక్కువే. ఎందుకంటే, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ (A+ గ్రేడ్) ద్వారా వీరికి ఏడాదికి రూ. 7 కోట్లు అందుతాయి. ఒక అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడితే వీరికి సుమారు రూ. 6 లక్షల మ్యాచ్ ఫీజు లభిస్తుంది. కానీ, దేశవాళీ క్రికెట్‌ను ప్రోత్సహించాలనే బీసీసీఐ నిబంధన మేరకు వీరు తక్కువ ఫీజు అయినప్పటికీ ఈ టోర్నీలో ఆడుతున్నారు.
ఇవీ చదవండి:
టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లో దీప్తి శర్మ!
టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు