Vijay Hazare Trophy: కుర్రాళ్లు కుమ్మేశారంతే.. 574 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసిన బిహార్!
ABN , Publish Date - Dec 24 , 2025 | 02:14 PM
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్-బిహార్ జట్లు తలపడుతున్నాయి. నిర్ణీత 50 ఓవర్లలో బిహార్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి ఏకంగా 574 పరుగులు చేసింది. ఇందులో ముగ్గురు సెంచరీలతో చెలరేగగా.. ఒకరు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బిహార్-అరుణాచల్ ప్రదేశ్ రాంచీ వేదికా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బిహార్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో రికార్డు స్థాయిలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. ఇది విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy) చరిత్రలోనే అత్యధిక స్కోరు. ఇంతకు ముందు ఈ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. ఆ జట్టు 2022లో అరుణాచల్ ప్రదేశ్ మీద 2 వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ రికార్డును బిహార్ బ్రేక్ చేసింది. రెండు సందర్భాల్లోనూ ప్రత్యర్థి జట్టు అరుణాచల్ ప్రదేశ్ కావడం గమనార్హం.
బిహార్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ(190), ఆయుశ్ లోహరుక(116), సకిబుల్ గని(128) భారీ సెంచరీలతో విరుచుపడ్డారు. పీయూశ్ సింగ్(77) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మూడు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో ఆ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. బిహార్ బ్యాటర్లో వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో సెంచరీ చేస్తే.. సకిబుల్ గని 32 బంతుల్లోనే శతకం బాదేశాడు.
ఇవీ చదవండి:
మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్.. తొలిసారి స్పందించిన స్టోక్స్
బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ