Share News

Maoist Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన కీలక నేత

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:29 PM

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేత లొంగిపోయారు.

Maoist Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన కీలక నేత
Maoist Surrender

హైదరాబాద్, జనవరి 2: మావోయిస్టు పార్టీకి మరో ఎదరుదెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టు నేతల పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. పలువురు కీలక నేతలు ఎన్‌కౌంటర్‌లో మరణించడం, పార్టీ బలహీనపడటం, ఆరోగ్య సమస్యలు ఇతరత్రా కారణాలతో గత సంవత్సరం వందల్లో మావోయిస్టులు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఇది మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బే అని చెప్పుకోవచ్చు. తాజాగా మరోసారి మావోయిస్టు పార్టీకి గట్టి షాక్ తగిలింది. మరో కీలక నేత పోలీసుల ముందు లొంగిపోయారు.


ఈరోజు (శుక్రవారం) మావోయిస్టు ముఖ్య నేత బర్సే దేవా.. డీజీపీ శివధర్ రెడ్డి (TelanganaDGP Shivadhar Reddy) ముందు లొంగిపోయారు. దేవా మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గా పనిచేస్తున్నారు. మావో అధినేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలను బర్సే దేవా చూస్తున్నారు. హిడ్మా, బర్సే దేవా ఒకే గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో దేవా అత్యంత కీలక పాత్ర పోషించారు.


ఇప్పుడు డీజీపీ ముందు దేవా లొంగిపోగా... అతడి నుంచి మౌంటెన్ ఎల్ఎంజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవాతో పాటు మిల్ట్రీ ఆపరేషన్ సభ్యులు కూడా సరెండర్ అయ్యారు. రేపు (శనివారం) బర్సే దేవాను మీడియా ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. దేవా లొంగిపోవడం, తదితర వివరాలను డీజీపీ మీడియా సమావశంలో చెప్పనున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

లైసెన్స్ లేకుండా తుపాకీ.. వ్యక్తి అరెస్ట్

అన్వేష్ కేసు.. ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసుల లేఖ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 12:37 PM