Share News

Telangana Police: సీఎం ఫొటోల వివాదం.. తెలంగాణాలో సంచలన సిట్ ఏర్పాటు

ABN , Publish Date - Jan 13 , 2026 | 02:10 PM

హైదరాబాద్ సీసీఎస్‌తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్‌లో నమోదైన సంచలన కేసుల్లో తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ సిట్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నాయకత్వం వహించనున్నారు.

Telangana Police: సీఎం ఫొటోల వివాదం.. తెలంగాణాలో సంచలన సిట్ ఏర్పాటు
Telangana Police

హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సీసీఎస్(CCS)తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్‌లో నమోదైన సంచలన కేసుల్లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(Telangana DGP Shivadhar Reddy) ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT)ను ఏర్పాటు చేశారు. ఈ సిట్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్(CP Sajjanar) నాయకత్వం వహించనున్నారు. మొత్తం ఎనిమిది మంది సభ్యులతో ఈ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు డీజీపీ.


సీఎం ఫొటోలు పోస్ట్ చేసిన కేసు..

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోలను అసభ్యకరంగా పోస్ట్ చేసిన వ్యవహారంలో తెలంగాణా పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూప్‌నకు చెందిన కావలి వెంకటేశ్‌పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న మద్దూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.


మహిళా ఐఏఎస్ అధికారిపై వార్తలపై..

తాజాగా ఓ మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచే విధంగా వార్తలు టెలికాస్ట్ చేసిన వ్యవహారంలో హైదరాబాద్ సీసీఎస్‌లో మరో కేసు నమోదైంది. ఈ కేసులో రెండు తెలుగు న్యూస్ ఛానల్స్, ఏడు యూట్యూబ్ ఛానళ్లపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేశ్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.


బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు

ఈ రెండు కేసుల్లో నిందితులపై BNS సెక్షన్లు 75, 78, 79, 351(1), 352(2) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


సిట్ దర్యాప్తు

ఈ రెండు కీలక కేసుల్లో దర్యాప్తు బాధ్యతను సిట్‌కు అప్పగించారు.

సిట్ సభ్యుల వివరాలు:

  • నార్త్ రేంజ్ జాయింట్ సీపీ - శ్వేత

  • చేవెళ్ల డీసీపీ – యోగేశ్ గౌతమ్

  • హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ – వెంకటలక్ష్మి

  • సైబర్ క్రైం డీసీపీ – అరవింద్ బాబు

  • విజిలెన్స్ అదనపు ఎస్పీ – ప్రతాప్ కుమార్

  • సీసీఎస్ ఏసీపీ – గురు రాఘవేంద్ర

  • సీఐ సెల్ ఇన్‌స్పెక్టర్ – శంకర్ రెడ్డి

  • సైబర్ సెల్ ఎస్సై – హరీశ్


ఈ వార్తలు కూడా చదవండి..

గాదె ఇన్నయ్య అనాథాశ్రమంలో ఎన్‌ఐఏ సోదాలు.. వాటిపై ఫోకస్..

పోటాపోటీగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముగ్గుల పోటీల ఫైనల్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 13 , 2026 | 02:38 PM