MLA Palla Rajeshwar Reddy: జనగామ జిల్లాను రద్దు చేస్తే ఊరుకోం..
ABN , Publish Date - Jan 13 , 2026 | 01:39 PM
జనగామ జిల్లాను రద్దు చేస్తే.. అగ్నిగుండమే.. అని బీఆర్ఎస్ నాయకుడు. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. అసలు రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు.
- ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ పేరుతో జనగామ జిల్లాను రద్దు చేయాలని చూస్తే జిల్లా అగ్నిగుండం అవుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Jangaon MLA Palla Rajeshwar Reddy) హెచ్చరించారు. జనగామలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని ఆరు జిల్లాలను కలిపి తిరిగి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు నాయుని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న జనగామ జిల్లాను రద్దు చేయాలని చూస్తే ఇక్కడి ప్రజలు ఊరుకోరన్నారు.

జిల్లాకు సర్వాయి పాపన్న పేరును పెడతామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, ఇప్పుడు ఏకంగా జిల్లానే లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కడియం శ్రీహరి ముందు నుంచీ జనగామ జిల్లాను వ్యతిరేకించారని గుర్తు చేశారు. జనగామ జిల్లాను మూసేయాలని చూస్తే ప్రభుత్వమే మూత పడుతుందన్నారు. జనగామ జిల్లాను వరంగల్ కమిషనరేట్ పరిధి నుంచి తొలగించి ప్రత్యేకంగా ఎస్పీని కేటాయించాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వందేభారత్ స్లీపర్‌లో నో ఆర్‌ఏసీ
‘తుంగభద్ర’ గేటు ట్రయల్‌రన్ సక్సెస్
Read Latest Telangana News and National News