Home » Palla Rajeshwar Reddy
డీజీపీ సీవీ ఆనంద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. కరీంనగర్‌లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ కార్యకర్తల దాడి అంశంపై డీజీపీకి బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల బారిన పడటం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ఒక ప్రజాప్రతినిధిని, అది కూడా ప్రభుత్వ ఉన్నతాధికారి పేరుతో బురిడీ కొట్టించారు.
అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవాదుల ప్రాజెక్టు సృష్టికర్త తానేనని కడియం చెప్పుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు.
జనగామ జిల్లాను రద్దు చేస్తే.. అగ్నిగుండమే.. అని బీఆర్ఎస్ నాయకుడు. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. అసలు రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు.
బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో శనివారం ప్రమాదం జరిగింది. పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. స్లాబ్ కూలి నలుగురు కూలీలకు గాయాలయ్యాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గాయపడ్డారు. బుధవారం ఉదయం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌ్‌సలో బాత్‌రూమ్‌లో కాలుజారి పడ్డారు.
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రమాదం జరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ప్రమాదవశాత్తూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి జారిపడ్డారు. ఆయనకు తుంటి ఎముకలో గాయం అయింది. దీంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు.
Telangana Assembly: మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్‌పై అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. జర్నలిస్టులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందన్నారు.
నాలుగు పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా జనగామ జిల్లా ఎర్రకుంట తండాలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు.
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జనగామ కాంగ్రెస్‌లో ముగ్గురు కోవర్టు నేతలు ఉన్నారని ఆరోపించారు.