Share News

TG News: పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం.. ఏమైందంటై..

ABN , Publish Date - Jul 12 , 2025 | 10:13 AM

బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో శనివారం ప్రమాదం జరిగింది. పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. స్లాబ్ కూలి నలుగురు కూలీలకు గాయాలయ్యాయి.

TG News: పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం.. ఏమైందంటై..
Anurag University Slab collapse incident

మేడ్చల్: బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి (BRS MLA Palla Rajeshwar Reddy) చెందిన అనురాగ్ యూనివర్సిటీలో (Anurag University) ఇవాళ(శనివారం) ప్రమాదం జరిగింది. పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్లాబ్ కూలి నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.


ఇద్దరి కూలీల పరిస్థితి విషమంగా ఉండటంతో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఎఫ్‌టీఎల్‌లో నూతనంగా నిర్మాణాలు చేపడుతున్నారని గతంలో అనురాగ్ యూనివర్సిటీపై పలువురు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మీడియాను కూడా యూనివర్సిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలీల కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

భదాద్రి భూముల కబ్జాపై స్పందించవా.. రామచంద్రా?: కేటీఆర్‌

సేంద్రియ వ్యవసాయమే శ్రీరామరక్ష

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 12 , 2025 | 10:19 AM