Share News

KTR; భదాద్రి భూముల కబ్జాపై స్పందించవా.. రామచంద్రా?: కేటీఆర్‌

ABN , Publish Date - Jul 12 , 2025 | 05:19 AM

భద్రాద్రి రామచంద్రస్వామి దేవస్థాన భూములు కబ్జా అవుతుండడంపై స్పందించవా..? రామచంద్రా..! అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు.

KTR; భదాద్రి భూముల కబ్జాపై స్పందించవా.. రామచంద్రా?: కేటీఆర్‌

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి రామచంద్రస్వామి దేవస్థాన భూములు కబ్జా అవుతుండడంపై స్పందించవా..? రామచంద్రా..! అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. భద్రాచల ఆలయానికి చెందిన 889 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో కబ్జాకు గురైతే.. బీజేపీ నేతల నుంచి ఒక్కమాట కూడా రాకపోవడం శోచనీయమని శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు.


ఈ అంశంపై మాట్లాడేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు సమయం లేదా? లేకపోతే కేవలం రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసమే మౌనంగా ఉంటున్నారా అని నిలదీశారు. తెలంగాణ బిడ్డల ఇంజనీరింగ్‌ ప్రతిభకు ఇంజనీర్‌ నవాబ్‌అలీ నవాబ్‌ జంగ్‌ బహదూర్‌ తార్కాణమని కేటీఆర్‌ అన్నారు. గురువారం నవాబ్‌ జంగ్‌ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ నీటి పారుదల రంగానికి ఆయన అందించిన ేసవలను గుర్తుచేసుకున్నారు.

Updated Date - Jul 12 , 2025 | 05:19 AM