బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టాడు: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ABN , Publish Date - Mar 25 , 2026 | 03:06 PM
అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవాదుల ప్రాజెక్టు సృష్టికర్త తానేనని కడియం చెప్పుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు.
హైదరాబాద్: అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు. దేవాదుల ప్రాజెక్టు సృష్టికర్త తానేనని కడియం చెప్పుకోవడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దేవాదుల ప్రాజెక్టు కోసం కడియం శ్రీహరి ఎలాంటి పాత్ర పోషించలేదని పల్లా ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తానే సృష్టికర్తనని చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
అలాగే కడియం శ్రీహరికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని తెలిపారు. ఎంపీ, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వంటి కీలక పదవులతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. కడియం శ్రీహరి బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టారని పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. ఆయన నిజాయితీ గల నాయకుడు కాదని తీవ్రంగా విమర్శించారు. ఇక డీలిమిటేషన్ జరిగినా జనగామ ప్రజలకు సేవ చేయడం కొనసాగిస్తానని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read:
ఆ ఇళ్లను కొత్త వారికి ఇస్తాం: మంత్రి పొంగులేటి
తెలంగాణ అసెంబ్లీలో డబుల్ బెడ్ రూం ఇళ్లపై చర్చ.. ఎవరేమన్నారంటే..
For More Latest News