Home » Kadiyam Srihari
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పేటెంట్ హక్కు రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉద్ఘాటించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి పేటెంట్ హక్కు కమ్యూనిస్ట్ పార్టీదే అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్‌లు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.
కాళేశ్వరంలో కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించినవేనని కడియం శ్రీహరి ఆరోపించారు.
కేసీఆర్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన శ్రద్ధ.. మిగతా ప్రాజెక్టుల మీద పెట్టలేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.
కడియం శ్రీహరికి ఘన్‌పూర్ అభివృద్ది ఇప్పుడు గుర్తొచ్చిందా అని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. కడియంకు తన అభివృద్ధి తప్పా.. ఘన్‌పూర్ అభివృద్ధితో పనిలేదని విమర్శించారు. ఘన్‌పూర్‌లో కడియం మార్క్ ఎక్కడా కనిపించదని తాటికొండ రాజయ్య ఆరోపించారు.
గత నెల 25న తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను అనుమతించిన సుప్రీం ధర్మాసనం.. పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలను వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది.
ఉగ్రవాదులు, మావోయిస్టులను ఒకే కోణంలో చూడకూడదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు
పార్టీ ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పును శిరసావహిస్తానని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అవసరమైతే ఉపఎన్నికను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
Kadium Srihari: బీఆర్ఎస్ స్వార్థపరమైన రాజకీయాలు చేస్తుందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. బీఆర్ఎస్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిదని అన్నారు.
పదేళ్లలో బీఆర్ఎస్ చేసింది దోపిడీ, భూకబ్జాలేనని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు.