Kadiyam Srihari Fires ON KCR Family: తెలంగాణ సంపాదన దోచుకున్నారు.. కడియం శ్రీహరి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:16 PM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పేటెంట్ హక్కు రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉద్ఘాటించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి పేటెంట్ హక్కు కమ్యూనిస్ట్ పార్టీదే అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
జనగామ, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ (BRS), కేసీఆర్ (KCR) కుటుంబంపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Station Ghanapur MLA Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సంపాదనని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్‌ని తప్పుబట్టే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇవాళ(ఆదివారం) జనగామలో మీడియాతో మాట్లాడారు కడియం శ్రీహరి.
మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఉంటే, ఆయన చెల్లి కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లివచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ మంత్రులకు, ఎంపీలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి మాత్రమే బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కడియం శ్రీహరి.
తెలంగాణ సాయుధ పోరాటానికి పేటెంట్ హక్కు కమ్యూనిస్ట్ పార్టీదే అని ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ ఇచ్చారని నొక్కిచెప్పారు. దండోరా ఉద్యమానికి పేటెంట్ హక్కు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగదని, అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పేటెంట్ హక్కు రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని కడియం శ్రీహరి ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్‌కి ఓటేస్తే బుల్డోజర్లు వస్తాయి.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ఎస్సారెస్పీ స్టేజ్ -2పై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
Read Latest Telangana News and National News