CM Revanth Reddy on SSRSP: ఎస్సారెస్పీ స్టేజ్ -2పై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ABN , Publish Date - Oct 12 , 2025 | 02:24 PM
ఎస్సారెస్పీ స్టేజ్ -2పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ -2కి ఆర్డీ ఆర్ స్టేజ్ 2గా నామకరణం చేస్తూ 24 గంటల్లోగా జీవో ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
సూర్యాపేట, అక్టోబరు12(ఆంధ్రజ్యోతి): ఎస్సారెస్పీ స్టేజ్ -2 (SSRSP Stage -2)పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ -2కి ఆర్డీ ఆర్ స్టేజ్ 2 - గా నామకరణం చేస్తూ 24 గంటల్లోగా జీవో ఇస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంపై పోరాడి ఎస్సారెస్పీ స్టేజ్ -2ని సాధించి గోదావరి జలాలు రప్పించడంలో దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని ప్రశంసించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉన్నా దామోదర్ రెడ్డి.. తన ఆస్తులు నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రజలకే అంకితం చేశారని కొనియాడారు. భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా దామోదర్ రెడ్డి కుటుంబానికి గాంధీ కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటిచ్చారు.
ఇవాళ(ఆదివారం) తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాపసభ జరిగింది. దామోదర్‌రెడ్డి సంతాప సభలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి సేవలని నేతలు గుర్తుకుచేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతిలో.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ
నార్సింగి డ్రగ్స్ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి
Read Latest Telangana News and National News