Share News

Notices to MLAs: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు.. కాంగ్రెస్‌లో చేరలేదంటున్న ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Aug 21 , 2025 | 08:15 AM

గత నెల 25న తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను అనుమతించిన సుప్రీం ధర్మాసనం.. పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలను వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది.

Notices to MLAs: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు.. కాంగ్రెస్‌లో చేరలేదంటున్న ఎమ్మెల్యేలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం తీసుకునే ముందు స్పీకర్‌ న్యాయనిపుణులతో, అడ్వొకేట్‌ జనరల్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై గెలిచిన ఈ పదిమంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ మారారు. దీంతో ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలను అనర్హలుగా ప్రకటించాలంటూ.. బీఆర్ఎస్ ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో, సుప్రీంకోర్టు గత నెల 25న స్పీకర్‌ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశించింది. దీని ప్రకారం.. ఇప్పుడు ఈ పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించి, వారి వివరణలు తీసుకున్న తర్వాత స్పీకర్‌ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలలో కొందరు తాము కాంగ్రెస్‌లో చేరలేదని చెబుతున్నట్లు సమాచారం..


గత నెల 25న తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను అనుమతించిన సుప్రీం ధర్మాసనం.. పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలను వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఏ ఎమ్మెల్యే అయినా.. స్పీకర్‌ ప్రక్రియను పొడిగించాలని అడగకూడదని హెచ్చరించింది. అలా చేస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొంది. రాజకీయ ఫిరాయింపులు జాతీయంగా చర్చనీయాంశంగా మారాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దాన్ని అరికట్టకపోతే.. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉందని వ్యాఖ్యానించింది. వివిధ సందర్భాల్లో ఈ అంశంపై పార్లమెంటులో చేసిన వివిధ ప్రసంగాలను కూడా పరిశీలించామని సుప్రీం చెప్పుకొచ్చింది. అయితే.. ఈ నోటీసులపై ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారు.. అనేది ఆసక్తికరంగా మారింది.


నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు :

1.కడియం శ్రీహరి

2.దానం నాగేందర్

3.పోచారం శ్రీనివాస్ రెడ్డి

4.సంజయ్ కుమార్

5.తెల్లం వెంకట్రావు

6.అరెకపూడి గాంధీ

7.కాలె యాదయ్య

8.ప్రకాశ్ గౌడ్

9.కృష్ణమోహన్ రెడ్డి

10.మహిపాల్ రెడ్డి


ఈ వార్తలు కూడా చదవండి..

అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక

Updated Date - Aug 21 , 2025 | 09:02 AM