Minister Savitha: అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు
ABN , Publish Date - Aug 21 , 2025 | 06:10 AM
అర్హులైన చేనేత కార్మికులందరికీ సకాలంలో ముద్ర రుణాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని చేనేత..
మంగళగిరి సిటీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): అర్హులైన చేనేత కార్మికులందరికీ సకాలంలో ముద్ర రుణాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత చెప్పారు. డిసెంబరు నాటికి 70ు ముద్ర రుణాలు పంపిణీ చేయాలని సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో బుధవారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఆమె సమీక్షించారు. చేనేత, జౌళి శాఖలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కమిషనర్ రేఖారాణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా తదితరులు పాల్గొన్నారు.