Share News

Assembly Speaker ON Defector MLA: అసెంబ్లీ స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల కీలక భేటీ.. ఎందుకంటే..

ABN , Publish Date - Sep 26 , 2025 | 07:19 PM

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్‌‌లు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.

Assembly Speaker ON Defector MLA: అసెంబ్లీ స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల కీలక భేటీ.. ఎందుకంటే..
Assembly Speaker Gaddam Prasad Kumar Assembly Speaker ON Defector MLA

హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ (Telangana Assembly Speaker Gaddam Prasad Kumar)తో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్‌‌లు ఇవాళ (శుక్రవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కూడా పాల్గొన్నారు.


అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ నోటీసులకు ఇప్పటికే కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్‌లు వివరణ ఇచ్చారు. అయితే, ఈ నెల 30వ తేదీ వరకూ కడియం శ్రీహరి గడువు కోరారు. ఈనెల 29 నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ ప్రత్యక్ష విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు విదేశీ పర్యటనకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెళ్లనున్నారు. విదేశీ పర్యటనకు ముందే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంపై విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అలర్ట్.. విమానాల దారి మళ్లింపు.. అసలు విషయమిదే..

కేసీఆర్ చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది: మాగంటి సునీత

For More TG News And Telugu News

Updated Date - Sep 26 , 2025 | 08:01 PM