Maganti Sunitha on Jubilee Hills Election: కేసీఆర్ చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది: మాగంటి సునీత
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:49 PM
కేసీఆర్ చేసిన అభివృద్ధే తనను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపిస్తుందని మాగంటి సునీత ధీమా వ్యక్తం చేశారు. తాను ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తోందని ఎప్పుడూ అనుకోలేదని మాగంటి సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bye Election)లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత (Maganti Sunitha)ను గులాబీ బాస్ కేసీఆర్ (KCR) ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మాగంటి సునీత ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరైనా టికెట్ ఆశించవచ్చని... కానీ తనమీద నమ్మకంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ చేసిన అభివృద్ధే తనను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తోందని ఎప్పుడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మాగంటి సునీత.
తన భర్త మాగంటి గోపీనాథ్ పోటీ చేసినప్పుడు బ్యాగ్రౌండ్ వర్క్ చేశానే తప్పా... బయటకు రాలేదని చెప్పుకొచ్చారు. తన భర్త గోపీనాథ్ మరణాన్ని ఇప్పటికీ జూబ్లీహిల్స్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలకు గోపీనాథ్ పెద్ద కొడుకుగా ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని స్పష్టం చేశారు. పార్టీలో అందర్నీ కలుపుతూ ముందుకు వెళ్తానని వెల్లడించారు. బీఆర్ఎస్ నాయకత్వం మద్దతుతోనే ఇక్కడి వరకూ వచ్చానని క్లారిటీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ను తన భర్త గోపీనాథ్ పటిష్టంగా తయారు చేశారని మాగంటి సునీత పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
అలర్ట్.. విమానాల దారి మళ్లింపు.. అసలు విషయమిదే..
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన RRR భూ నిర్వాసితులు
For More TG News And Telugu News