Share News

Komatireddy Rajagopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన RRR భూ నిర్వాసితులు

ABN , Publish Date - Sep 26 , 2025 | 01:28 PM

నల్లగొండ జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగం నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిశారు. భూమి కోల్పోతున్న వారి ఇబ్బందులను ఆయనకు వివరించారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు.

Komatireddy Rajagopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన RRR భూ నిర్వాసితులు
Komatireddy Rajagopal Reddy

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని (Komatireddy Rajagopal Reddy) రీజనల్ రింగ్ రోడ్ (RRR) భూ నిర్వాసితులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన రైతుల సమస్యలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రైతులకు భూమితో భావోద్వేగ సంబంధం ఉంటుందని, ఆ బంధాన్ని గౌరవించాలని ఆయన అన్నారు. పార్టీ, ప్రభుత్వం కంటే ప్రజలే తనకు ముఖ్యమని, ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ పనిచేస్తానని చెప్పారు.


ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు వల్ల భూ నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు, రహదారి వెళ్లే దక్షిణ భాగంలోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఈ సమస్యపై చాలా మంది ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, అధికార పార్టీలో ఉన్నప్పటికీ తాను ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడతానని ఆయన స్పష్టం చేశారు. పదవి కిరీటం కాదని, అది ఒక బాధ్యత అని, ధర్మం, న్యాయం వైపు తాను ఎప్పుడూ ఉంటానని ఆయన అన్నారు.


మునుగోడు నియోజకవర్గంలో సగం భాగం ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు పరిధిలోకి వస్తుందని కోమటిరెడ్డి తెలిపారు. రహదారి అలైన్‌మెంట్ మార్పు విషయంలో రైతులకు సరైన వివరణ ఇచ్చి, వారిని ఒప్పించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతిపక్షాలు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని, కానీ తాము ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తామని ఆయన అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ వెళ్లే నియోజకవర్గాల ఎమ్మెల్యేలంతా కలిసి ముఖ్యమంత్రితో ఈ విషయమై చర్చిస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 26 , 2025 | 01:36 PM