2 Vande Bharat Trains Hyderabad: హైదరాబాద్‌కు 2 కొత్త వందే భారత్ రైళ్లు.. ఆ ఎక్స్‌ప్రెస్ స్థానంలో వస్తుందా..
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:33 PM
తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి రైల్వే శాఖ గుడ్‌న్యూస్ తెలిపింది. త్వరలోనే ఈ మార్గంలో రెండు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఇవి ఏ ప్రాంతాల్లో మొదలవుతాయి, ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ప్రయాణించే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఎందుకంటే రైల్వే శాఖ ఈ మార్గంలో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది (2 Vande Bharat Trains Hyderabad). దీంతో ఈ ప్రాంతాల్లో రైలు ప్రయాణం మరింత ఈజీగా మారబోతుంది. ఒక రైలు హైదరాబాద్ నుంచి పూణేకు, మరొకటి సికింద్రాబాద్ నుంచి నాందేడ్‌కు నడుస్తుంది. ఈ కొత్త రైళ్లు ప్రయాణ సమయాన్ని రెండు నుంచి మూడు గంటల వరకు తగ్గించనున్నాయి. ఈ రెండు కొత్త రైళ్లు తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ప్రయాణ సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచనున్నాయి.
సికింద్రాబాద్-పూణే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో భర్తీ చేయాలని రైల్వే ఆలోచిస్తోంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం ఎనిమిదిన్నర గంటల్లో ఈ దూరాన్ని పూర్తి చేస్తుంది. ఈ రైలు వారంలో ఆరు రోజులు (మంగళవారం తప్ప) నడుస్తుంది. తక్కువ స్టాప్‌లతో, రెండు ఏసీ ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు, తొమ్మిది ఏసీ చైర్ కార్లు, రెండు ఈఓజీ కోచ్‌లతో ఉంటుంది.
ఈ నిర్ణయం సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-యశ్వంత్‌పూర్ రూట్లలో ఇప్పటికే నడుస్తున్న వందే భారత్ రైళ్ల భారీ ఆదరణ నేపథ్యంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కొత్త రైళ్లతో సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) మొత్తం ఏడు వందే భారత్ సర్వీసులను నడుపుతుంది. ఇది ఈ స్వదేశీ సెమీ-హైస్పీడ్ రైళ్లను అత్యధికంగా నడిపే జోన్లలో ఒకటిగా నిలుస్తుంది. అంతేకాక, సికింద్రాబాద్-ముజఫర్‌పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒక నెలలోపు ప్రారంభమవుతుంది. ఇది నగరం నుంచి మరో లాంగ్-డిస్టెన్స్ ట్రైన్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
వందే భారత్ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో, వేగవంతమైన ప్రయాణ సమయంతో ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తాయి. ఈ రైళ్లు స్వదేశీ సాంకేతికతతో నిర్మితమై, భారత రైల్వేలో ఒక కొత్త ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ఈ కొత్త సర్వీసులు ప్రారంభమైతే, ప్రయాణికులకు మరింత సౌలభ్యం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి