Home » Komatireddy Rajgopal Reddy
సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకే పర్మిట్ రూం లేకుండా వైన్స్ నిర్వహించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. దొంగ చాటుగా బెల్ట్ దుకాణాలకు సరఫరా, అధిక ధరలతో సిండికెట్‌గా మారి డూప్లికేట్ మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు.
నల్లగొండ జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగం నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిశారు. భూమి కోల్పోతున్న వారి ఇబ్బందులను ఆయనకు వివరించారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు.
తనపై వచ్చే తప్పుడు వార్తలు, అబద్దాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ఎంపీ, ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు కాంగ్రెస్ పార్టీ అన్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నా ఎంతో అభిమానమని తెలిపారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలని నిరుద్యోగ యువత చేస్తున్న డిమాండ్ సరైనదే అని ఎమ్మెల్యే తెలిపారు. నిరుద్యోగ పిల్లలకు దారి చూపించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లో చేరికలను ఆహ్వానించామని ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్న నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరాలని సూచించారు. మీడియా ముందు అంతర్గత విషయాలు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని మల్లు రవి హెచ్చరించారు.
తనకు మంత్రి పదవి రాకున్నా పర్వాలేదని, తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తే చాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.
రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చినప్పుడు తమ అన్నదమ్ముళ్లకు మంత్రి పదవులిస్తే తప్పేంటని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు.
మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే తనకు అన్యాయం జరిగినట్లేనని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం జరిగితే ఫర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని.. గత ప్రభుత్వానికి చెప్పానని.. ఈ ప్రభుత్వానికీ చెబుతున్నానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ నజర్ అయింది.రాజ్‌గోపాల్ రెడ్డితో గురువారం ఫోన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడనున్నారు. తరచూగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై రాజ్‌గోపాల్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు.
మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.