Share News

Rajgopal Reddy On Wine Shops: వైన్ షాపులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

ABN , Publish Date - Oct 14 , 2025 | 10:46 AM

సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకే పర్మిట్ రూం లేకుండా వైన్స్ నిర్వహించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. దొంగ చాటుగా బెల్ట్ దుకాణాలకు సరఫరా, అధిక ధరలతో సిండికెట్‌గా మారి డూప్లికేట్ మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు.

Rajgopal Reddy On Wine Shops: వైన్ షాపులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్
Rajgopal Reddy On Wine Shops

నల్లగొండ, అక్టోబర్ 14: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్‌రెడ్డి (MLA Komatireddy Rajgopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో వైన్స్ నడవనివ్వనని స్పష్టం చేశారు. పదవి ఉన్నా లేకున్నా ఒకటే అని.. తనకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని స్పష్టం చేశారు. టెండర్ వేసే వాళ్లు నిబంధనలు పాటించాలన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకే పర్మిట్ రూం లేకుండా వైన్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దొంగ చాటుగా బెల్ట్ దుకాణాలకు సరఫరా, అధిక ధరలతో సిండికెట్‌గా మారి డూప్లికేట్ మద్యం అమ్ముతున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.


ఊరి బయట ఉండాల్సిన వైన్ షాపులను సెంటర్లో పెడుతున్నారని మండిపడ్డారు. ఇతర జిల్లా, మండలాల వారు మునుగోడు షాప్స్‌కు టెండర్ వేయొద్దని అన్నారు. ప్రజల ఆరోగ్యం మెరుగుపర్చేలా ఎక్సైజ్ పాలసీని మార్చడంపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.


మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 18 వరకు టెండర్లు వేసేందుకు అవకాశం కల్పించారు. తెలంగాణ వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలవడంతో జిల్లాల వారీగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. గతంతో పోల్చితే దరఖాస్తు ఫీజు కూడా పెరిగింది. గతంలో ఒక్కో అప్లికేషన్‌కు రూ.2 లక్షలు ఉండగా.. ఈ ఏడాది ఆ ఫీజు కాస్తా మరో లక్ష పెరిగి రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. ఈనెల 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువుగా నిర్ణయించగా.. దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఈనెల 23న కొత్త మద్యం షాపులకు డ్రా తీయనున్నారు. ఈ డ్రాలో వైన్ షాపులకు లైసెన్స్ పొందిన వారు అదే రోజు మొదటి విడత చెల్లింపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆరు విడతలుగా లైసెన్స ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం కల్పించారు. కొత్త దుకాణాలకు డిసెంబర్ 1, 2025 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితి ఉండనుంది.


ఇవి కూడా చదవండి..

హంగు, ఆర్భాటం లేకుండా నామినేషన్ వేయనున్న సునీత

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు తెలంగాణ సర్కార్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 11:09 AM