• Home » Nalgonda

Nalgonda

చిన్నారి ప్రాణంతీసిన పాఠశాల బస్సు

చిన్నారి ప్రాణంతీసిన పాఠశాల బస్సు

అప్పటివరకు తల్లి వెంట ఉన్న ఆ చిన్నారి పాలిట బడి బస్సు మృత్యుశకటమైంది.

‘ అంగన్‌వాడీ’ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా

‘ అంగన్‌వాడీ’ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా

మాతా శిశు సంరక్షణలో కీలక పాత్ర వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్ల య్య యాదవ్‌ అన్నారు.

ఎన్‌ఎస్పీ కాల్వలో పడి యువకుడి మృతి

ఎన్‌ఎస్పీ కాల్వలో పడి యువకుడి మృతి

న్‌ఎస్పీ కాల్వలో పడి యువకుడు మృతి చెం దాడు. ఎస్‌ఐ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బొల్లం అంజయ్య (41) గొర్లకాపరి.

నేటి నుంచి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు

అర్వపల్లి మండల కేంద్రం లోని యోగానందలక్ష్మీనర్సింహస్వామి ఆలయం, హుజూర్‌నగర్‌ పట్టణ పరిధిలోని ఫణిగిరి గట్టుపై సీతారామచంద్రస్వామి ఆలయ బహ్మోత్స వాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

తిమ్మాపూర్‌ నిర్వాసితులకు పునరావాసం

తిమ్మాపూర్‌ నిర్వాసితులకు పునరావాసం

భువనగిరి మండలం బీఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి తెలిపారు. భువనగిరి మండలం హుస్నాబాద్‌లో సర్వే నెం.107లో నిర్వాసితుల కోసం కేటాయించిన లేఅవుట్‌లో విద్యుత్‌, నీరు, రోడ్ల కోసం పంచాయతీరాజ్‌, నీటి పారుదల, ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్‌ శాఖ అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు.

చెర్వుగట్టుపై ఘనంగా  అగ్నిగుండాల మహోత్సవం

చెర్వుగట్టుపై ఘనంగా అగ్నిగుండాల మహోత్సవం

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో ని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం ఘనంగా జరిగింది. ఓం నమఃశివా య అంటూ భక్తిపారవశ్యంతో కణకణ మండే నిప్పుకణికలపై శివసత్తులు, భక్తులు, అధికారులు ఉత్సాహంగా నడిచి తమ భక్తి విశ్వాసాలను చాటుకున్నారు. తొలుత పర్వతవాహన సేవతో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రధానాలయ మహామండపం నుంచి సన్నాయి వాయిద్యాల మధ్య అగ్నిగుండాల మహోత్సవ వేదిక వద్దకు తీసుకువచ్చారు.

పాతగుట్టలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

పాతగుట్టలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనృసింహుడి పుణ్యక్షేత్రం లో మంగళవారం వార్షిక తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాలకు అర్చకబృం దం పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో శ్రీకారం పలికారు. విశ్వశాంతి, లోకకల్యాణార్థం ప్రతీ ఏటా స్వామి సన్నిధిలో నిర్వహించే తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాతగుట్ట ప్రధానాలయంలో కొలువుదీరిన మూలమూర్తులను కొలిచిన ఆచార్యులు ఉత్సమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన శేషవాహన సేవపై తీర్చిదిద్ది ప్రత్యేక వేదికపై అధిష్టింపజేశారు.

నేడు గుట్ట బస్టాండ్‌ ప్రారంభం

నేడు గుట్ట బస్టాండ్‌ ప్రారంభం

యాదగిరిగుట్ట బస్టాండ్‌ ను మంత్రులు బుధవారం ప్రారంభించనున్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా రూ.6కోట్లతో ఆధునిక హంగులతో బస్టాండ్‌ను నిర్మించారు. లక్ష్మీనరసింహుడి దర్శనానికి వచ్చే భక్తులకు బస్టాండ్‌ నిర్మాణం ఎంతో ఉపయుక్తంగా మారనుంది.

ప్రజలతోనే ఫ్రెండ్లీ.. క్రిమినల్స్‌తో కఠినమే

ప్రజలతోనే ఫ్రెండ్లీ.. క్రిమినల్స్‌తో కఠినమే

ప్రజలతోనే ఫ్రెండ్లీ పో లీసింగ్‌, క్రిమినల్స్‌తో మాత్రం కఠినంగానే ఉంటామని యా దాద్రి జోన్‌ డీసీపీ రాజేష్‌ చంద్ర అన్నారు. డీసీపీగా బాధ్యతలు స్వీకరించాక భువనగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడబోమని, అసాంఘిక శక్తులను కఠినంగా అణచివేస్తామ న్నారు. సివిల్‌ కేసుల్లో వచ్చే ఫిర్యాదులపై క్షేత్ర పరిశీలన చేశాకే కేసులు నమోదు చేస్తామని, ఈ మేరకు యాదాద్రి జోన్‌ ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

పోచంపల్లిలో విగ్రహాల వివాదం

పోచంపల్లిలో విగ్రహాల వివాదం

భూ దాన్‌పోచంపల్లిలో విగ్రహాల వివాదం నెలకొంది. ప్రధాన రహదారిపై నేతాజీ విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ మున్సిపల్‌ అధికారులు నిర్మాణ పనులను అడ్డుకున్నా రు. దీంతో యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎట్టకేలకు నేతాజీ జయంతి రోజున గత నెల 23న తడక వెంకటేష్‌, సార బాలయ్యలు నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పట్టణంలోని పోలీ్‌సస్టేషన్‌ వద్ద రోడ్డు మధ్యలో కొత్తగా నేతన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పద్మశాలి మహాజన సంఘం సంకల్పిం చి, భారీగా విరాళాలు సేకరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి