Share News

చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

ABN , Publish Date - Feb 13 , 2026 | 10:50 AM

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డుల్లో 9 స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
Chityala Municipality Election

నల్లగొండ, ఫిబ్రవరి 13: జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మొత్తం 12 వార్డులకు గానూ 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. చిట్యాలలో కాంగ్రెస్ బలమైన ప్రదర్శన కనబరిచి.. మెజారిటీ వార్డుల్లో గెలుపొందింది. మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం రెండు వార్డుల్లో మాత్రమే గెలుపొందింది. కాంగ్రెస్ 9 వార్డులు, బీఆర్ఎస్ 2 వార్డులను కైవసం చేసుకోగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక వార్డును దక్కించుకున్నారు.


వార్డుల వారీగా విజేతలు:

  • 1వ వార్డు: ట్రాన్స్‌జెండర్ ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం

  • 2వ వార్డు: బీఆర్ఎస్ - అజిమ్ (270 ఓట్ల మెజారిటీ)

  • 3వ వార్డు: కాంగ్రెస్ - గాలి యాదమ్మ లింగయ్య

  • 4వ వార్డు: కాంగ్రెస్ - కోనేటి ఎల్లయ్య

  • 5వ వార్డు: కాంగ్రెస్ - గుండెబోయిన శ్రీలక్ష్మీసైదులు (35 ఓట్ల మెజారిటీ)

  • 6వ వార్డు: కాంగ్రెస్ - జెరిపోతుల సత్యనారాయణ

  • 7వ వార్డు: కాంగ్రెస్ - దేశపాక రాజేశ్ లత

  • 8వ వార్డు: కాంగ్రెస్ - కుక్కల మోహన్

  • 9వ వార్డు: కాంగ్రెస్ - ఏర్పుల పరమేశ్

  • 10వ వార్డు: బీఆర్ఎస్ - నిమ్మనగోటి శ్రీను (120 ఓట్ల మెజారిటీ)

  • 11వ వార్డు: కాంగ్రెస్ - బొబ్బల రాంరెడ్డి

  • 12వ వార్డు: కాంగ్రెస్ - పందిరి గీతా రమేశ్


ఇవీ చదవండి:

తెలంగాణ మున్సిపల్ కౌంటింగ్: వరంగల్, నిజామాబాద్‌లలో క్యాంప్ పాలిటిక్స్ హీట్!

గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త..

Updated Date - Feb 13 , 2026 | 11:00 AM