మున్సిపల్ కౌంటింగ్‌పై బీఆర్ఎస్ అలర్ట్.. గులాబీ శ్రేణులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Feb 13 , 2026 | 10:22 AM
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ గులాబీ శ్రేణులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ గులాబీ శ్రేణులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు తెలంగాణ భవన్‌లో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా కీలక సమావేశం నిర్వహించారు కేటీఆర్.
పార్టీ జిల్లా సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో మాట్లాడి.. కేటీఆర్ పలు కీలక సూచనలు జారీ చేశారు. కౌంటింగ్ సందర్భంగా జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గెలిచిన అభ్యర్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమన్వయకర్తలదేనని మార్గనిర్దేశం చేశారు. గెలిచిన అభ్యర్థులకు వెంటనే విప్ జారీ చేయాలని సూచించారు. ఎక్స్ అఫీషియో మెంబర్ల అవసరం ఎక్కడ ఉంటుందో ముందే చెప్పాలని సమన్వయకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమున్న మున్సిపాలిటీల్లో తమ పార్టీ ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల ఓటు నమోదు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ మున్సిపల్ కౌంటింగ్: వరంగల్, నిజామాబాద్‌లలో క్యాంప్ పాలిటిక్స్ హీట్!
గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త..
Read Latest Telangana News And AP News And Telugu News