మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్.. ఉమ్మడి నల్గొండలో గెలుపెవరిదంటే
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:24 PM
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఈ నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
నల్గొండ జిల్లా, ఫిబ్రవరి 12: తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న (బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఈ నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సర్వే ప్రకారం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు ఇలా ఉన్నాయి. 17 మున్సిపాలిటీల్లో మొత్తం 15 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు సాధించే అవకాశం ఉందని, మిగిలిన రెండు స్థానాల్లో హంగ్ రావచ్చని సర్వేలో తేలింది.
నల్గొండ జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీలకు గాను.. 17 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. నకిరేకల్ మున్సిపాలిటీలో ఎన్నిక జరుగలేదు. అలాగే కోదాడలో మూడు స్థానాలు, హాలియాలో ఒకటి, గుట్టలో ఒకటి, చౌటుప్పల్‌లో ఒక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న అసద్ గ్యాంగ్... భయంతో వణికిపోతున్న ప్రజలు
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News And Telugu News