Share News

చండూరులో కాంగ్రెస్ హవా.. 6 వార్డుల్లో విజయం

ABN , Publish Date - Feb 13 , 2026 | 11:09 AM

నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 10 వార్డుల్లో 6 స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

చండూరులో కాంగ్రెస్ హవా.. 6 వార్డుల్లో విజయం
Chandur Municipality Election

నల్లగొండ, ఫిబ్రవరి 13: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల(Municipality Election) కౌంటింగ్ కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో అధికార పార్టీ హవా కొనసాగుతోంది. జిల్లాలోని చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో చండూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 10 వార్డుల్లో కాంగ్రెస్ 6, బీఆర్‌ఎస్ 3, సీపీఐ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి.


గెలిచిన అభ్యర్థులు వీరే..

  • 1వ వార్డు: బీఆర్ఎస్ - తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్ (109 ఓట్ల మెజార్టీ)

  • 2వ వార్డు: కాంగ్రెస్ - బుషిపాక వాసు (51 ఓట్ల మెజార్టీ)

  • 3వ వార్డు: బీఆర్ఎస్ - సామ సుజాత యాదవ రెడ్డి (116 ఓట్ల మెజార్టీ )

  • 4వ వార్డు: సీపీఐ - జెల్లా ధనమ్మ (136 ఓట్ల మెజార్టీ)

  • 5వ వార్డు: బీఆర్ఎస్ - కొండ్రెడ్డి మధు (358 ఓట్ల మెజార్టీ)

  • 6వ వార్డు: కాంగ్రెస్ - కోడి శ్రీనివాసులు (471 ఓట్ల మెజార్టీ)

  • 7వ వార్డు: కాంగ్రెస్ - కోడి సుష్మ వెంకన్న (307 ఓట్ల మెజార్టీ)

  • 8వ వార్డు: కాంగ్రెస్ - భూతరాజు దశరథ (180 ఓట్ల మెజార్టీ)

  • 9వ వార్డు: కాంగ్రెస్ - కలిమికొండ జనార్ధన్ (240 ఓట్ల మెజార్టీ )

  • 10వ వార్డు: కాంగ్రెస్ - కటకం రమేశ్ (25 ఓట్ల మెజార్టీ)


ఇవి కూడా చదవండి...

టార్గెట్‌ 2029.. ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం..

కాపులను ఇబ్బంది పెట్టి 'తగ్గేదేలే' అంటూ సైగలా.. అంబటిపై పంచుమర్తి ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 11:27 AM