Share News

నా భార్య గెలుపు.. పవన్‌ కళ్యాణ్‌కు ఇదే నా గిఫ్ట్: నాగేశ్వరరావు

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:15 PM

నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థి విజయలక్ష్మి గెలుపుపై భర్త నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు పవన్‌ కళ్యాణ్‌కు తాము ఇచ్చే బహుమానం అని అన్నారు.

నా భార్య గెలుపు.. పవన్‌ కళ్యాణ్‌కు ఇదే నా గిఫ్ట్: నాగేశ్వరరావు
Nereducharla Municipality

నల్గొండ, ఫిబ్రవరి 13: ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14వ వార్డును జనసేన పార్టీ(Janasena Party)) సొంతం చేసుకుంది. 60 ఓట్ల మెజార్టీతో జనసేన అభ్యర్థి విజయ లక్ష్మి(Vijaya Laksmi) గెలుపొందారు. ఆమె విజయంపై భర్త నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు తన జీవితంలో మర్చిపోలేని రోజన్నారు. ఈ గెలుపు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌‌కు గిఫ్ట్‌ అని అన్నారు. జనసేన అడుగులు తెలంగాణలో పడాలన్న జనసేనాని కోరికకు తామిస్తున్న బహుమతి ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు.


గ్రూప్‌ 2కు ప్రిపేర్ అవుతున్న తన భార్యను ఒప్పించి మరీ ఎన్నికల్లో నిలబెట్టానని.. తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందన్నారు. తెలంగాణలో జనసేన గెలుపు ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. దాని వెనక తమ కష్టం ఉందని చెప్పారు. తెలంగాణలో పవన్‌‌‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతర పోరాటం చేసినట్లు తెలిపారు. తన భార్యను గెలిపించినందుకు నేరేడుచర్ల ప్రజానీకానికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నాగేశ్వరరావు. మరోవైపు.. మంచిర్యాల కార్పొరేషన్ 34 డివిజన్ జనసేన అభ్యర్థి సాగర్ కూడా విజయం సాధించారు.


ఇవి కూడా చదవండి...

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ముందు ఇండిపెండెంట్ ‘డిమాండ్’

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌దే పైచేయి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 03:33 PM