ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌దే పైచేయి
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:20 PM
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మొత్తం ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలకు గానూ.. 4 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
నిజమాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అత్యధిక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ సత్తా చాటుతోంది. ఇక.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ అధికార పార్టీ తన హవాను కొనసాగిస్తోంది. మొత్తం ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలకు గానూ.. 4 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది హస్తం పార్టీ.
1. భీంగల్ మున్సిపాలిటిలో మొత్తం 12 వార్డులు
కాంగ్రెస్ - 8
బీఆర్ఎస్ - 4
గెలుపు: కాంగ్రెస్
2. బిచ్కుంద మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు
కాంగ్రెస్ - 8
బీఆర్ఎస్ - 2
గెలుపు: కాంగ్రెస్
3. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు
కాంగ్రెస్ - 10
బీఆర్‌ఎస్ - 1
ఇండిపెండెంట్ - 1
గెలుపు: కాంగ్రెస్
4. బాన్సువాడ మున్సిపాలిలో మొత్తం 19 వార్డులు
కాంగ్రెస్ - 10
బీఆర్‌ఎస్ - 4
బీజేపీ - 3
ఇండిపెండెంట్ - 1
ఎంఐఎం - 1
గెలుపు: కాంగ్రెస్
ఇవి కూడా చదవండి...
సుల్తానాబాద్ మున్సిపాలిటీ ‘హస్త’గతం
అలంపూర్ నియోజకవర్గం.. మూడు మున్సిపాలిటీల ఫలితాలివే..
Read Latest Telangana News And Telugu News