Home » Nizamabad
జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) ఎన్.వి.దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఖాతాదారులకు ఇవ్వాల్సిన రుణాలు వాళ్లకు ఇవ్వకుండా.. తానే తీసుకొని ఘరానా మోసానికి పాల్పడ్డాడో బ్యాంకు మేనేజర్. రుణాల పేరిట దాదాపు 40 మంది ఖాతాల్లో నుంచి రూ.5 కోట్లకు పైగా డబ్బును తన ఖాతాలో జమ చేసుకుని మోసగించాడు.
నిజామాబాద్ జిల్లా: నవీపేట్ మండలంలోని విషాదం నెలకొంది. ఫక్రాబాద్ రూల్ పట్టాలపై బార్యా భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పొత్తంగల్ మండలంలోని హెగ్డోలీ గ్రామానికి చెందినవారు. అనీల్, శైలజ అనే దంపతులు చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి బంధువులకు కోటగిరి పోలీసులకు పంపించారు.
నిజామాబాద్ జిల్లా మెండోర మండల కేంద్రానికి చెందిన తక్కల సాయిరెడ్డి(Takkala Sai Reddy) మంగళవారం స్థానికంగా ఉన్న వైన్స్లో కొనుగోలు చేసిన బీరు సీసాలో ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్(D Srinivas) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
కామారెడ్డి: జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. బీబీపేట మండల కేంద్రానికి చెందిన వీణ(35) అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వీణకు సిద్దిపేటకు చెందిన శ్రావణ్ కుమార్తో 2015లో వివాహం జరిగింది.
ఈ నెల 9న వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన అల్లంనేని పాపారావు (65) తన చేలో మొక్కజొన్న కొయ్యల దహనానికి అగ్గిపుల్ల గీయగా మంటలు చెలరేగాయి. ఎండల తీవ్రతతో మరింత పెట్రేగాయి. వాటి ధాటికి పాపారావు సజీవ దహనమయ్యాడు.
‘‘కేసీఆర్.. రైతుభరోసా వచ్చిందో రాలేదో.. ఏ రైతు ఖాతాలోనైనా చూడు. ఈ నెల 9లోపు రైతుభరోసా వేస్తానని.. వేయలేకపోతే అమరవీరుల స్తూపం వద్ద
బీజేపీ ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాస్ వార్నింగ్ ఇచ్చారు. పసుపు బోర్డు కోసం ఇక్కడి రైతులు దీక్ష చేసినప్పుడు వచ్చానని అన్నారు. వారు ఇచ్చిన సహకారంతో పీసీసీ అధ్యక్షుడినయ్యానని గుర్తుచేశారు. నిజామాబాద్ లోని ఆర్మూర్లో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.