బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:20 AM
నిజమాబాద్ జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మొత్తం 12 వార్డులకు గానూ 10 స్థానాలను దక్కించుకుంది కాంగ్రెస్.
నిజామాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల(Municipality Election) కౌంటింగ్‌లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయ దుందుభి మోగిస్తున్నారు. నిజామాబాద్‌లోని బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువ వార్డులను సొంతం చేసుకున్నారు. బిచ్కుంద మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డులకు గానూ 10 వార్డుల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్‌ఎస్ 2 వార్డులను మాత్రమే సొంతం చేసుకుంది.
విజేతలు వీరే..
వార్డు 1: కాంగ్రెస్ - గోనె హన్మవ్వ
వార్డు 2: కాంగ్రెస్ - చిన్న మారుతి
వార్డు 3: కాంగ్రెస్ - కార్తీక ధర్పల్
వార్డు 4: బీఆర్ఎస్ - బొమ్మల అనిత
వార్డు 5: బీఆర్ఎస్ - శ్యామల
వార్డు 6: కాంగ్రెస్ - నౌషా నాయక్
వార్డు 7: కాంగ్రెస్ - ముజాహిద్
వార్డు 8: కాంగ్రెస్ - షేక్ గులాం సందానీ
వార్డు 9: కాంగ్రెస్ - ధర్పల్ గంగాధర్
వార్డు 10: కాంగ్రెస్ - మఠం మానస
వార్డు 11: కాంగ్రెస్ - భాగ్యలక్ష్మి
వార్డు 12: కాంగ్రెస్ - సీమ షెట్కర్
ఇవి కూడా చదవండి...
కాపులను ఇబ్బంది పెట్టి 'తగ్గేదేలే' అంటూ సైగలా.. అంబటిపై పంచుమర్తి ఫైర్
చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
Read Latest Telangana News And Telugu News