కన్న కూతురిని చంపిన తండ్రి.. ఎందుకో తెలుసా?
ABN , Publish Date - Feb 02 , 2026 | 02:47 PM
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి తన కూతురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనే స్వార్థంతో పెంచిన ప్రేమను మర్చిపోయి కూతురిని హతమార్చిన సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రి తన స్వార్థం కోసం అభం శుభం తెలియని ఆరేళ్ల కూతురిని హత్య చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటన నిజామాబాద్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర (Maharashtra)లో నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా కేరూర్‌కు చెందిన పాండురంగ, త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే, ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హత ఉందని పాండురంగ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఆరేళ్ల పెద్ద కూతురు ప్రాచీని బైక్‌పై తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ARP క్యాంప్ శివారులో కాలువలో పడేసి చంపేశాడు.
కెనాల్‌లో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పాప మృతదేహాన్ని బయటకు తీసి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో కన్న తండ్రే హంతకుడని తేలింది. పాండురంగ్‌తో పాటు అతనికి సహకరించిన గణేష్ షిండేను అరెస్ట్ చేశారు. బాలికను తీసుకువచ్చేందుకు ఉపయోగించిన బైక్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు.
ఇవి కూడా చదవండి:
టెస్ట్ మ్యాచ్‌లు ఎప్పుడూ తెల్ల జెర్సీలలోనే ఎందుకు ఆడతారు.. ఆసక్తికర కారణమంటంటే..
ఏపీలో కావాలనే జగన్ అండ్ కో అల్లర్లు సృష్టించారు: ఎంపీ రమేశ్