Share News

టెస్ట్ మ్యాచ్‌లు ఎప్పుడూ తెల్ల జెర్సీలలోనే ఎందుకు ఆడతారు.. ఆసక్తికర కారణమేంటంటే..

ABN , Publish Date - Feb 02 , 2026 | 12:04 PM

మన దేశంలో ప్రజలు క్రికెట్‌ను ఒక క్రీడగా కాకుండా ఒక పండుగలా చూస్తారు. ఇతర క్రీడల కంటే క్రికెట్ అంటేనే ఇక్కడి ప్రజలకు మక్కువ ఎక్కువ. ఇంత స్పీడ్ యుగంలో కూడా టెస్ట్ క్రికెట్‌ను మన దేశ వాసులు ఇష్టపడుతూనే ఉంటారు.

టెస్ట్ మ్యాచ్‌లు ఎప్పుడూ తెల్ల జెర్సీలలోనే ఎందుకు ఆడతారు.. ఆసక్తికర కారణమేంటంటే..
why test cricket players wear white

మన దేశంలో ప్రజలు క్రికెట్‌ను ఒక క్రీడగా కాకుండా ఒక పండుగలా చూస్తారు. ఇతర క్రీడల కంటే క్రికెట్ అంటేనే ఇక్కడి ప్రజలకు మక్కువ ఎక్కువ. ఇంత స్పీడ్ యుగంలో కూడా టెస్ట్ క్రికెట్‌ను మన దేశ వాసులు ఇష్టపడుతూనే ఉంటారు. అయితే టెస్ట్ క్రికెట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మాత్రం ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. వన్డే, టీ-20 ఫార్మాట్ ఆడేటపుడు రంగురంగుల దుస్తులు వేసుకునే క్రికెటర్లు, టెస్ట్ మ్యాచ్ ఆడేటపుడు మాత్రం తెలుపు రంగు దుస్తులనే ధరిస్తుంటారు.


టెస్ట్ క్రికెటర్లు ఎప్పుడూ తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా? ఏ దేశ వాసులైనా సరే టెస్ట్ క్రికెట్ అంటే తెలుపు దుస్తులతోనే ఆడతారు. దాని వెనుక ఓ ఆసక్తికర కారణం ఉంది. సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌లు ఏ దేశంలోనైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా ఆడతారు. పూర్తిగా ఎండలోనే ఆడాల్సి ఉంటుంది. ఆ ఎండ వేడిని తెలుపు రంగు దుస్తులైతే గ్రహించకుండా ఉంటాయి. మిగతా రంగుల దుస్తులు ఎండను గ్రహించి వేడెక్కిపోతాయి. తెలుపు రంగుతో ఆ ఇబ్బంది ఉండదు. అందుకే టెస్ట్ క్రికెట్ ఆడేటపుడు తెలుపు రంగు జెర్సీలను ధరిస్తారు.


ఇక, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వన్డే, టీ20 మ్యాచ్‌లలో తెల్లటి బంతిని ఉపయోగిస్తారు. అయితే టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం రెడ్ బాల్‌తోనే ఆడతారు. దాని వెనుక కూడా ఓ ఆసక్తికర కారణం ఉందట. టెస్ట్ మ్యాచ్‌ల్లో జెర్సీ తెల్లగా ఉండటం వల్ల, తెల్లటి బంతిని చూడటం కష్టం. అందుకే టెస్ట్ మ్యాచ్‌లు ఎర్రటి బంతితో ఆడతారు. ఎర్రటి బంతి చాలా సులభంగా కనిపిస్తుంది.


ఇవి కూడా చదవండి..

అమెరికాకు వార్నింగ్.. ఇరాన్‌పై దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధం తప్పదంటున్న ఖమేనీ..


స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 02 , 2026 | 12:27 PM