Nizamabad: ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా చంపి.. హార్ట్‌ఎటాక్ అని నాటకమాడి
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:38 PM
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను దారుణంగా చంపింది భార్య. తన గుట్టు బయట పడకుండా హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి దొరికిపోయింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా, జనవరి 5: మక్లూర్ మండలం బొర్గాంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియుడి(Lover) మోజులో పడి భార్య(Wife) కట్టుకున్న భర్త (Husband)ను నిర్దాక్షిణ్యంగా ఉరేసి చంపింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పట్టాటి రమేశ్ (35) భార్య సౌమ్య ఓ ప్రైవేట్ స్కూల్లో(private school) ఉద్యోగం చేస్తుంది. అదే స్కూల్‌లో పీఈటీ (PET)గా పనిచేస్తున్న దిలీప్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భర్త రమేశ్ కి తెలియడంతో ఇద్దరికీ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే తన భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది సౌమ్య. గత నెల 20న తన ప్రియుడు దిలీప్‌తో కలిసి రమేష్‌ని ఇంట్లోనే టవల్‌తో ఉరేసి హత్య చేసింది. అనంతరం ఏమీ తెలియనట్లుగా తన భర్త గుండెపోటుతో చనిపోయాడని బోరున విలపిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా అందరినీ నమ్మించి హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేసింది.
అంత్యక్రియల సమయంలో గ్రామస్థులు రమేశ్ మెడపై గాట్లు ఉండటం గమనించారు. అనుమానం వచ్చి వెంటనే ఇజ్రాయెల్‌లో ఉంటున్న అతని తమ్ముడు కేదారికి సమాచారం అందించారు. కేదారి వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు బయటపడింది. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి విచారింగా.. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతోనే హత్య చేసినట్లు రమేశ్ భార్య సౌమ్య ఒప్పకుంది. ఈ కేసులో పోలీసులు సౌమ్యతోపాటు మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పదమూడేళ్ల వైవాహిక బంధం, ముగ్గురు పిల్లలు ఉన్నారన్న కనీస జ్ఞానం లేకుండా మధ్యలో వచ్చిన ప్రియుడి కోసం భర్తను అన్యాయంగా చంపిన సౌమ్యకు కఠినమైన శిక్ష పడాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఆత్మహత్యకు పాల్పడ్డ జూనియర్ డాక్టర్ మృతి
శాసనమండలిలో ఇదే నా చివరి ప్రసంగం: కవిత
Read Latest Telangana News And Telugu News