Share News

Kavitha: శాసనమండలిలో ఇదే నా చివరి ప్రసంగం: కవిత

ABN , Publish Date - Jan 05 , 2026 | 12:54 PM

శాసనమండలిలో ఇదే తన చివరి ప్రసంగం అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సమక్క - సారలమ్మ జాతరపై జరిగిన చర్చలో ఎమ్మెల్సీ ప్రసంగించారు.

Kavitha: శాసనమండలిలో ఇదే నా చివరి ప్రసంగం: కవిత
Kavitha

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (MLC kavitha) కన్నీరు పెట్టుకున్నారు. సోమవారం నాడు శాసనమండలిలో సమక్క - సారలమ్మ జాతరపై జరిగిన చర్చలో ఎమ్మెల్సీ మాట్లాడారు. శాసనమండలిలో ఇదే తన చివరి ప్రసంగమంటూ కవిత కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివాసీ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా సమ్మక్క, సారక్క వైదిక చిహ్నాలను చెక్కారని.. ఇది కరెక్ట్ కాదని అన్నారు. దీనిపై ఆదివాసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని తెలిపారు. సమ్మక్క - సారక్క జాతరకు దేవాదాయ శాఖ పర్యవేక్షణ కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు.


దీనిపై గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణ ఉండాలని అభిప్రాయపడ్డారు. హుండీ వచ్చింది అంటే దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్తుందన్నారు. భవిష్యత్‌లో సమ్మక్క - సారక్క చరిత్ర కాకుండా వైదిక చరిత్రగా మారే అవకాశం ఉందన్నారు. సమ్మక్క,సారక్క జాతరలో అమ్మవార్లు అడవి నుంచి రావడం సాంప్రదాయమని... నిత్య పూజలు చేయడం అనేది ముఖ్యం కాదన్నారు. దీనిపై ఆదివాసీ, గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్‌రావుకు ఊరట

ఆత్మహత్యకు పాల్పడ్డ జూనియర్ డాక్టర్ మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 05 , 2026 | 01:07 PM