Share News

Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్‌రావుకు ఊరట

ABN , Publish Date - Jan 05 , 2026 | 11:53 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.

Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్‌రావుకు ఊరట
Supreme Court

న్యూఢిల్లీ, జనవరి 5: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు (Former Minister Harish Rao) సుప్రీం కోర్టులో (Supreme Court) భారీ ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్పీని సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.


అయితే గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు సుప్రీంలో విచారణ జరుగగా.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎస్‌ఎల్పీలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.


ఇవి కూడా చదవండి...

ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేడు సుప్రీంలో విచారణ.. తీవ్ర ఉత్కంఠ

రంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన.. అప్పుడే పుట్టిన బిడ్డను దారుణంగా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 05 , 2026 | 12:18 PM