Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేడు సుప్రీంలో విచారణ.. తీవ్ర ఉత్కంఠ
ABN , Publish Date - Jan 05 , 2026 | 09:44 AM
తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సుప్రీంలో సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది.
న్యూఢిల్లీ, జనవరి 5: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు (సోమవారం) సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావును (Former Minister Harish Rao) విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంను సర్కార్ ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ భూయాన్ ధర్మాసనం ముందు నేడు విచారణకు రానుంది. 2024లో సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ తన ఫోన్‌ను మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు పోలీస్ అధికారి రాధాకిషన్ రావు ట్యాప్ చేశారని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
2024 డిసెంబర్ 1న పోలీసులు ఎఫ్ఎఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తనపై అక్రమ కేసు పెట్టారని.. తనపై నమోదు అయిన ఎఫ్ఆర్‌ను క్వాష్ చేయాలని కోరుతూ హరీష్ రావు 2024 డిసెంబర్ 4న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2024 మార్చి 24న హరీష్ రావుపై కేసు పెట్టడానికి సరైన ఆధారాలు, బలమైన సాక్షాలు లేవన్న వాదనలతో హైకోర్టు ఏకీభవిస్తూ ఈ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో హరీష్ రావును ప్రతివాదిగా చేరుస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తాజాగా పిటిషన్ దాఖలు చేసింది.
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్‌ను కూడా ప్రభుత్వం ప్రతివాదిగా చేరింది. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఎలాంటి వాదనలు జరుగనున్నాయి?.. హరీష్ రావుకు అనుకూలంగా తీర్పు రానుందా? లేక వ్యతిరేకంగానా?.. సుప్రీం కోర్టులో జరిగే వాదనలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి...
ఏపీలో దారుణం.. పోలీసు స్టేషన్ ఎదురుగానే కాపు కాచి..
ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And Telugu News