Share News

Eshwarappa Case: ఏపీలో దారుణం.. పోలీసు స్టేషన్ ఎదురుగానే కాపు కాచి..

ABN , Publish Date - Jan 05 , 2026 | 09:06 AM

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనకల్లు మండల పోలీస్ స్టేషన్ ఎదుట ఈశ్వరప్ప అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈశ్వరప్పను రాగినేపల్లి గ్రామానికి చెందిన హరి, చిన్నప్ప హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Eshwarappa Case: ఏపీలో దారుణం.. పోలీసు స్టేషన్ ఎదురుగానే కాపు కాచి..
Eshwarappa Case

శ్రీ సత్యసాయి జిల్లా, 5 జనవరి (ఆంధ్రజ్యోతి): శ్రీ సత్యసాయి జిల్లాలో (Sri Sathya Sai District) దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనకల్లు మండల పోలీస్ స్టేషన్ ఎదుట ఈశ్వరప్ప అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈశ్వరప్పను రాగినేపల్లి గ్రామానికి చెందిన హరి, చిన్నప్ప హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.


హత్యకు కారణమిదేనా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాగినేపల్లికి చెందిన హరి భార్యతో మార్పురివాండ్లపల్లికి చెందిన ఈశ్వరప్ప అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజుల క్రితం హరి భార్యను ఈశ్వరప్ప వెంట తీసుకువెళ్లాడు. తన భార్య కనిపించడం లేదని భర్త హరి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతంలో ఈశ్వరప్పని గుర్తించి తమకల్లు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు.


పోలీస్ స్టేషన్ ఎదుట హత్య

అదే సమయంలో రాగినేపల్లి గ్రామం నుంచి హరి, చిన్నప్ప తనకల్లు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. కాపు కాచి వేట కొడవలితో ఈశ్వరప్పని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. హరి, చిన్నప్పలను అరెస్టు చేశారు.


పోలీసుల అదుపులో నిందితులు

రాగినేపల్లి గ్రామంలో జరిగిన ఈ దారుణ హత్యా సంఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు హరి, చిన్నప్పలు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ హత్యకి తనకల్లు పోలీస్ స్టేషన్‌లోని ఓ హెడ్ కానిస్టేబుల్ సహకారం ఉందని ఈశ్వరప్ప కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతస్థాయి అధికారులు మరింత సీరియస్‌గా విచారిస్తున్నారు. ఈ హత్యా ఘటనకు సంబంధించి తనకల్లు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితులను విచారించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చారిత్రక ఘట్టం

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వివరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 05 , 2026 | 11:04 AM