Rangareddy: రంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన.. అప్పుడే పుట్టిన బిడ్డను దారుణంగా
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:05 AM
రంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చెత్త కుప్పలో పడేసి వెళ్లారు.
రంగారెడ్డి, జనవరి 5: తొమ్మిది నెలలు మోసి కన్న బిడ్డపై తల్లికి మమకారం ఎక్కువే. అప్పటి వరకు పడిన బాధను.. పుట్టిన బిడ్డను చూసి మరిచిపోతుంది. కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తల్లి. కానీ.. ఇటీవల అప్పుడే పుట్టిన పసికందులను నిర్దాక్షణ్యంగా రోడ్డుపై వదిలేసిన ఘటనలు ఎన్నో చూస్తున్నాం. అక్రమ సంబంధం, పెళ్లి కాకుండానే తల్లయిన కొందరు.. మాతృత్వాన్ని మంట గలుపుతున్నారు. పుట్టిన వెంటనే తల్లి పొత్తిళ్లలో హాయిగా ఉండాల్సిన పసికందులను చెత్తకుప్పల్లో, రహదారులపై పడేస్తుండటం పలువురిని కలచివేస్తోంది. రంగారెడ్డి జిల్లాలోనూ ఇలాంటి అమానుష ఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే...
మైలార్‌దేవ్ పల్లి డివిజన్ పరిధిలో బాబుల్ రెడ్డి నగర్‌లో దారుణ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన ఓ పసికందును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన చెత్త కుప్ప వద్ద పడేసి వెళ్లిపోయారు. చెత్త కుప్పల్లో పడేయడంతో పాప తీవ్ర అస్వస్థకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృత శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ పసికందును ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? ఆడపిల్ల పుట్టిందని ఇలా చేశారా? లేక మరే ఇతర కారణాలున్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబు
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేడు సుప్రీంలో విచారణ.. తీవ్ర ఉత్కంఠ
Read Latest Telangana News And Telugu News